Sirulolikinche Song Lyrics From Yamaleela Movie In Telugu & English
సినిమా : యమలీల
గాయకులు : చిత్ర, ఎస్ పి బాలసుబ్రమణ్యం
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : ఎస్ వి కృష్ణారెడ్డి
నటీనటులు : అలీ, మంజు భార్గవి, ఇంద్రజ
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు..
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూనా...
ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా ...
మహారాజులా.... జీవించాలి నిండునూరేళ్లూ....
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు....
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు...
జాబిల్లి జాబిల్లి జాబిల్లి....
మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి....
నాలో మురిపెమంతా పాల బువ్వై పంచనీ...
లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ....
మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ....
ఊరూవాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ.....
కలకాలమూ కనుపాపల్లే కాసుకోనీ....
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ....
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు.... ఆ...
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు...ఆ...
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు
లా...ల లా... లలా..... లా..
లా...ల లా... లలా..... లా..
లా...ల లా... లలా..... లా..
లా...ల లా... లలా..... లా..
వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా...
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా....
నాలో అణువు అణువు ఆలయంగా మారగా...
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా....
తోడుండగా నను దీవించే కన్నప్రేమ..
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా..
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు...ఆ...
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు...ఆ...
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు
ఎదగాలీ ఇంతకు ఇంతై ఈ పసికూనా...
ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా.... మహారాజులా....
Movie : Yamaleela
Singer : Chitra, S P Bala Subrahmanyam
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : S V Krishna Reddy
Star Cast : Ali, Manju Bhargavi, Indraja
Sirulolikinche Chinni Navvule Manimanikyalu....
Cheekati Eragani Baabu Kannule Malagani Deepalu
Budibudi Nadakala Tappatadugule Taragani Maanyalu
Chitipoti Palukula Muddu Maatale Maa Dhana Dhaanyalu
Edagali Inthaku Inthai Ee Pasikoonaa...
Yelali Ee Jagamanthaa Eppatikainaa...
Maharaajulaa...Jeevinchali Nindu Noorellu....
Sirulolikinche Chinni Navvule Manimanikyalu....
Cheekati Eragani Baabu Kannule Malagani Deepalu...
Jabilli Jabilli Jabilli....
Manchi Jabilli Jabilli Jabilli....
Naalo Muripemanthaa Paala Buvvai Panchanee....
Lolo Aasalannee Nijamayelaa Penchanee...
Madilo Machhaleni Chandamaama Nuvvanee...
Ooruvaada Ninne Mechhukunte Choodanee...
Kalakaalamu Kanupaapalle Kaasukonee....
Nee Needalo Pasipaapalle Cherukonee....
Sirulolikinche Chinni Navvule Manimanikyalu....
Cheekati Eragani Baabu Kannule Malagani Deepalu
Budibudi Nadakala Tappatadugule Taragani Maanyalu
Chitipoti Palukula Muddu Maatale Maa Dhana Dhaanyalu
Laa....La Laa...Lalaa...laa...
Laa....La Laa...Lalaa....laa...
Laa....La Laa...Lalaa....laa...
Laa....La Laa...Lalaa....laa....
Vesaa Modati Adugu Amma Vele Oothagaa...
Nerchaa Modathi Paluku Amma Pere Aadhigaa...
Naalo Anuvu Anuvu Aalayangaa Maaragaa....
Nithyam Koluchukonaa Amma Runame Teeragaa....
Thodundagaa Nanu Deevinche Kanna Prema....
Keedannade Kanipinchenaa Ennadainaa...
Sirulolikinche Chinni Navvule Manimanikyalu....
Cheekati Eragani Baabu Kannule Malagani Deepalu
Budibudi Nadakala Tappatadugule Taragani Maanyalu
Chitipoti Palukula Muddu Maatale Maa Dhana Dhaanyalu
Edagali Inthaku Inthai Ee Pasikoonaa...
Yelali Ee Jagamanthaa Eppatikainaa...Maharaajulaa...

Comments