Posts

Showing posts from September, 2025

Yaalo Yaala Song Lyrics From Animal Movie In Telugu & English

Image
  చిత్రం : యానిమల్  గాయకులు : అనురాగ్ కులకర్ణి  సాహిత్యం : అనంత శ్రీరాం  సంగీతం : జాని  నటీనటులు : రణబీర్ కపూర్, రష్మిక మండన్న   ఆ... ఆఆ....  ఆ... ఆఆ.... ఆ... ఆఆ....  ఆ... ఆఆ.... హో యాలో యాలా యాలోరే హో యాలో యాలా యాలోరే హో ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే హో ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే ఓ యాలో యాలా యాలోరే ఓ యాలో యాలా యాలోరే ఎన్నో ఏండ్ల ఆకలికి యాట మొదలైందయ్యో ఈ యాలే ఎన్నో ఏండ్ల ఆకలికి యాట మొదలైందయ్యో ఈ యాలే మండేటి ఎండల నుండి ఎగసిపడే సూరీడులాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి నీ సుట్టు ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంట నిన్ను నాలోనా అచ్చేసుకుంట నిన్ను నా మీనా మొక్కేది నిన్నే ఎపుడైనా నా సామివంటే నువ్వే లోకానా సెమ్మ సేరదు మీ కంటా ఓ సెమ్మ సేరదు మీ కంటా అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపదే రాదంటా హో పిడుగై నేనటే రానా హో బడాబాగ్నులు ఈదైనా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా బతికేదే మీకోసం ఈ బతుకే మీ దయ కోసం మీరే లేరనే ఓ మాట నిజం గాకున్నా నను సంపెయ్ దా అది అనేటిదే నోరైనా దాన్ని ఆడే త...

Dosthulam Song Lyrics From Mem Famous Movie In Telugu & English

Image
  చిత్రం : మేము ఫేమస్ గాయకులు : కాల భైరవ సాహిత్యం : కళ్యాణ్ నాయక్, కోటి మామిడ్ల సంగీతం : కళ్యాణ్ నాయక్ నటీనటులు : సుమంత్ ప్రభాస్, మౌర్య చౌదరి, మణి ఏగుర్ల అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాల తోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా మనకు మనకు మధ్య దాచుకున్న మాటలంటు లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టె ఈ బాధే లోతునా అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోను ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోను నీతోనే ఉన్నామురా గొప్పల్లోను నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదలమురా నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనకే మాటలు కలిసిన భాదుందిరా లోపల స్నేహంలోన కోపాలన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎపుడు ఉండే ఆకాశమే కదరా అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్లలోకి కన్నీరు రాగానే మాట కొంచం తడబడుతుండగనే ఏమయ్యింది మామా...