Aditi Short Film Song Lyrics In Telugu & English
సినిమా : అదితి (షార్ట్ ఫిల్మ్) గాయకులు : గీతామాధురి సాహిత్యం : కిట్టు విస్స ప్రగడ సంగీతం : విశ్వనాథ ఘంటసాల నటీనటులు : నందు, గీతామాధురి దట్స్ రైట్ నాకోసం జాబిల్లి ఆకాశన్నే వదిలి ఈ నేలకు విచ్చేసి కొత్త నేస్తమై కలిసిందా తడియారిన గుండెల్లో సెగలారని ఊహల్లో తెరదాగని నవ్వులతో వాన జల్లులా కురిసిందా మనసున అలజడి తనువున చొరబడి ఏదో మాయలా నదివలె పరుగిడి అడుగులు తడబడి దారే మార్చగా తపనలు తెలిపెను తొలివలపిది అని కవ్వింతయిలా వలపుల తలపుల తలపులు తెరవగా నన్నే చేరగా కురిసే జడిలో కబురే వింటూ తడిలో జడతో తగిలింది కుదురే మరిచి కసురే పెంచి దిండుతో దండించింది అపుడే అటుగా అడుగేవేస్తే పసుపే కసిగా విసిరింది ఎపుడు ఎదలో కదిలో నాలో ఎన్నో అందాలే గ గ గ గ గ గ రీ స నీ పా మ గ గ గ గ గ గ రీ గా పా మ ఆ.... ఆ ఆ.... అర్థరాత్రిలోనా గోడ దూకుతుంటే టైము చూడమంటూ కంటిచూపుతో కసిరింది తెల్లవారుతుంటే... గాఢ నిద్ర మాని పరుగుపెట్టమన్నట్టు వీధి వెంట నన్ను తరిమింది తలమునకల తొలి తహతహ తెలిస...