సినిమా : అసలేం జరిగింది గాయకులు : విజయ్ ప్రకాష్
సాహిత్యం : చిర్రావూరి విజయ కుమార్ సంగీతం : ఎలేందర్ మహావీర్
నటీనటులు : శ్రీరాం, సంచిత పడుకొనే
వెన్నెల చిరునవ్వై గుండెలో కొచ్చావే
అంతులేని ఆనందం తోడు నాకిచ్చావే
వెన్నెల చిరునవ్వై గుండెలో కొచ్చావే
అంతులేని ఆనందం తోడు నాకిచ్చావే
నాలోకొచ్చి నీవే నన్ను ఏదో చేశాసావే
మనసే లాగేశావే నాలో నన్నుకాజేసావే
చిట్టి గుండెలనే పట్టి గిలిగింత పెట్టావే
ఊపిరి ఆగేలా చేసే మత్తు కళ్ళు నీవే
ఎట్టా ఉండాలే పిల్లా నిన్నిట్ఠా చూస్తుంటే
పిచ్చి ఎక్కిపోతుందే పిల్లా నీవట్ట చూస్తుంటే
ఎవరిని చూసిన ఏ పని చేసిన
ఎదురుగ నువ్వల కనబడతావే
పారాణి పాదాలే కదిపావ గల్లంతు
కుదురే లేక కునుకే రాక
క్షణమొక యుగమే
యాలో యాలో యాలో
నువ్వంటే ఎంతో ఇష్టం
యాలో యాలో యాలో
కాదంటే చాల కష్టం
చిట్టి గుండెలనే పట్టి గిలిగింత పెట్టావే
ఊపిరి ఆగేలా చేసే మత్తు కళ్ళు నీవే
ఎట్టా ఉండాలే పిల్లా నిన్నిట్ఠా చూస్తుంటే
పిచ్చి ఎక్కిపోతుందే పిల్లా నీవిట్ఠా చూస్తుంటే
కనులకు కాటుకే రాసిన వేళలో
చిలిపిగా చూడకే చిరునవ్వులతో
ఓసారి అవునంటూ ఓసారి కాదంటూ
కోపంలోనూ నచ్చేస్తూ తికమక పెడుతూ...
ప్రియ ప్రియ ప్రియ నీవంటే ఎంతో ఇష్టం
ప్రియ ప్రియ ప్రియ మనసంతా నువ్వే నువ్వే
కల్లోకి వస్తావే కానీ కౌగిలంటే రావే
ముద్దుగుంటావే కానీ ముద్దు పెట్టనీవే
ఎట్టా ఉండాలే పిల్లా నిన్నిట్ఠా చూస్తుంటే
పిచ్చి ఎక్కిపోతుందే పిల్లా నీవాట్ట చూస్తుంటే
Comments