Rekkale Song Lyrics From Ooriki Uttarana Movie In Telugu
సినిమా : ఊరికి ఉత్తరాన గాయకులు : అనుదీప్ దేవ్
సాహిత్యం : పూర్ణ చారి సంగీతం : సురేష్ బొబ్బిలి
నటీనటులు : నరేన్ వనపర్తి, దీపాలి శర్మ
రెక్కలే వచ్చినట్టు ఉందే మనసుకే ఈ నిమిషం
నింగిలో తేలినట్టు ఉందే ఎందుకో ....
స్వర్గమే అందినట్టు ఉందే చేతికే ఈ క్షణం ....
కొత్తగా పుట్టినట్టు ఉందే ఏమిటో
సిండ్రెల్లా లాంటి పిల్లే ...
చిన్ని నవ్వే నవ్వినాదే ...
నా చిట్టి గుండెలోన చిచ్చు పెట్టి వెల్లినాదే
దీని నవ్వు మీద మాగాణి మట్టెయ్య దేవుడా...
పిల్ల స్మైల్ కే నే ఫ్లాటు అయిపోయా ...
నా గుండెకాయ నా మాట ఇనదెట్టా దేవుడా ..
పిల్ల లేత పెదవిన ఫ్రెంచు కిస్సేట్టా
ఏయ్ నీ చూపులో ఏమున్నదో
నీ వైపుకే లాగెనులే
నీ నవ్వుతో మత్తె జల్లి మైకంలో ముంచావే
ఇన్నాళ్లుగా వేచి ఉన్నది
నీ కోసమే అని తెలిసెనులే
ఈ నాటితో నా ఆశలే ఉప్పొంగి ఎగిసెనులే
విరహాన్ని దాచేసిలా నీ చెంతకే చేరానులే
కొంటె చూపులే బాణాలుగా నీపైకి విసిరానే
వేల రాగాలుగా నా గొంతులో
ఓ వింత భావం పలికెనులే
మౌన భాషలే నా గుండెలో సరిగమ పాడెనే
దీని నవ్వు మీద మాగాణి మట్టెయ్య దేవుడా...
పిల్ల స్మైల్ కే నే ఫ్లాటు అయిపోయా ...
నా గుండెకాయ నా మాట ఇనదెట్టా దేవుడా ..
పిల్ల లేత పెదవిన ఫ్రెంచు కిస్సేట్టా
ఏ వింతనో నీ ప్రేమలో నన్నింతగా మార్చేసిందిలే
ఏ మాయనో అన్నట్టుగా ఏమార్చివేసావే
నీ స్పర్శలో హాయిన్నదే
ఆ తీపి నేడే తెలిసిందిలే
నిను చుసిన ప్రతి చోటులో ఓ జ్ఞాపకం ఉందే
అక్షరాలలో చెప్పేందుకు నాకున్న భాష సరిపోదులే
చందమామకి నీ పోలికే అప్పిచ్చివుంటావే
గాలి రాతలే నా చేతికి అలవాటులా అయిపోయలే
చెప్పుకొనేలా నా గుండెకే నీ పిచ్చి పట్టిందిలే
దీని నవ్వు మీద మాగాణి మట్టెయ్య దేవుడా...
పిల్ల స్మైల్ కే నే ఫ్లాటు అయిపోయా ...
నా గుండెకాయ నా మాట ఇనదెట్టా దేవుడా ..
పిల్ల లేత పెదవిన ఫ్రెంచు కిస్సేట్టా
Comments