సినిమా : మది గాయకులు : సాయి చరణ్ భాస్కరుని, హరిణి ఇవటూరి
సాహిత్యం : పూర్ణ చారి సంగీతం : పివిఆర్ రాజా
నటీనటులు : శ్రీరాం నిమ్మల, రిచా జోషి
కడలి అలలు కలిసే.. కలలు కనులు తెరిచే..
ఎపుడు కనని వరుసే.. ప్రేమని తెలిసే
ఉన్నానో లేదో నేనేమైపోయానో
నీలోనే వెతికానో నీలాగే మారానో
ఇన్నాళ్లకు నన్ను కొత్తగా చూస్తునాన్నో
నీతోనే కలిసాకే నా దారి మార్చాను
ప్రణయం ప్రణయం ప్రణయం ప్రణయం
తెలిసే వివరం ఈ నిమిషంకి
విరహం విరహం మొదలయ్యే విరహం
ఎదలో జరిగే ఒక మదనం
చాటుగనే చూస్తుంది నా చిన్ని మనసు
ఏ దారి ఏ తీరు తనకేమి తెలుసు
నీ రాకతో వచ్చింది ఓ తెల్లని తళుకు
ఆ మాటే అంటాను నువ్వు వేగపడకు
ఎగిరే వయసుకి కళ్లెం వేసావే
ఎదలో చేరి కల్లోలం చేసి
అదరం చాటు మధురం చూపావే
మరణం లేని ప్రేమని పంచి
ప్రణయం ప్రణయం ప్రణయం ప్రణయం
తెలిసే వివరం ఈ నిమిషంకి
విరహం విరహం మొదలయ్యే విరహం
ఎదలో జరిగే ఒక మదనం
దూరంగా ఉంటేనే దగ్గరవుతాము
ఏ భాష లేదంటూ మౌనంలో మనము
ఆరాటం ఉంటుంది చూడాలని నాకు
ఆలోచన పోదంట నిను చేరువరకు
కరగదు కాలము ఈ నెమ్మది ఏంటో
కౌగిలి చేరేటి ఆ క్షణమేదో
చెరుగని జ్ఞాపకం తోడుగ ఉంటుంటే
నవ్వులే పూయవ ప్రేమొక ఋతువై
ప్రణయం ప్రణయం ప్రణయం ప్రణయం
తెలిసే వివరం ఈ నిమిషంకి
విరహం విరహం మొదలయ్యే విరహం
ఎదలో జరిగే ఒక మదనం
Comments