Yedu Rangula Song Lyrics From Trishanku Movie in Telugu
గాయకులు : రాహుల్ సిప్లిగంజ్ సంగీతం : సునీల్ కశ్యప్
సాహిత్యం : బాషా శ్రీ సినిమా : త్రిశంకు
నటీనటులు : అమన్ , ప్రాచి టెహ్లన్
సాహిత్యం : బాషా శ్రీ సినిమా : త్రిశంకు
నటీనటులు : అమన్ , ప్రాచి టెహ్లన్
ఏడు రంగులా… ఓ ఇంద్రధనస్సులా
వచ్చేసావే నా ముందుకు
నీలి కన్నులా… ఓ జింక పిల్లలా
దూకేసావే నా గుండెలో
ఏముందే నీ చూపులోనా… గాయమే చేసిందిలే
రాయిలా కూర్చున్న మనసే… రెక్కలొచ్చి ఎగిరిపోయేలే
ఒక్కో క్షణం ఒక్కో యుద్ధం చేస్తున్నా నేను
నువ్వే నువ్వే నాకు దూరంగుంటే
నిరంతరం నువ్వే జగం అనుకుంటూ నేను
ప్రతిక్షణం నీకోసం బ్రతికేస్తున్నా
ఏడు రంగులా ఓ ఇంద్రధనస్సులా
వచ్చేసావే నా ముందుకు
మౌనం పెదవుల్తో ఎదో చెబుతుంటే
అది విని నా మనసే పరిగెడుతుందే
తీరం నా పక్కన నడిచి వస్తుంటే
అయినా దూరంగా అనిపిస్తుందే
కల కాదు నిజం ఇది అర్థం కానీ చిత్రం
నాలో అల్లరి నీలో చూస్తున్నా
చెప్తే నీకీనిజం నమ్మవు అనే సత్యం
నాలో నేనే నవ్వుకు చస్తున్నా
ఒక్కో క్షణం ఒక్కో యుద్ధం చేస్తున్నా నేను
నువ్వే నువ్వే నువ్వే నాకు దూరంగుంటే
నిరంతరం నువ్వే జగం అనుకుంటూ నేను
ప్రతిక్షణం నీకోసం బ్రతికేస్తున్నా
ఏడు రంగులా ఓ ఇంద్రధనస్సులా
వచ్చేసావే నా ముందుకు
ఎక్కడ దాగావో ఇన్నాళ్లుగా నువ్వు
వచ్చావిప్పటికీ ఓ పండుగలా
ఎప్పటికైనా నువ్వే నాలో సగమంటూ
చెప్పెను మరుసగమే నాలో ఉంటూ
ఏమంటు వచ్చావే… నాలోకమే నువ్వయ్యావే
నా నీడలో కూడా నిన్నే చూస్తున్నా
ఆ దేవుడిని అడిగేసి… నీ గుండెల్లో నా పేరు రాసి
పసి పిల్లాడిలా నీలో దాగుంటా
మళ్ళీ మళ్ళీ పుట్టేస్తానే నీకోసం నేను
కావాలంటే చెప్పు నీకే రాసిస్తానే
ఒక్కో క్షణం ఒక్కో జన్మ లాగుందే నాకు
ఈ జన్మకి ఇంతే చాలని జీవిస్తానే

Comments