Ningina Jaarina Song Lyrics From Swa Movie In Telugu
గాయకులు :కార్తీక్, నాదప్రియా సంగీతం : కరణం శ్రీ రాఘవేంద్ర
సాహిత్యం : నాగరాజు కువ్వారపు సినిమా : స్వ
నటీనటులు :మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమి రెడ్డి
నింగిన జారిన జాబిలి ఏదో నేలకు చేరి
నన్నే తాకి తీయని ఆశలు నాలో రేపిందా
ఎదురై నిలిచి నన్నే తడిమి
ఎదనే దోచి మతినే చెడిపి
నన్నే నాకు దూరం చేసిందా, ఆఆ ఆ
సరాసరి నేనే నీలో చేరె మార్గాలల్లేయెద్దే
పదే పదే నా ప్రాణం నీవేనంటూ నా చుట్టు తిరుగుతుంటే
అంతలా ఎగిరి పడుతుంటే… కలనై చెదిరిపోనా
ప్రేమేంటో తెలియని నీకు… నాపై ఎందుకంత ధీమా
చూపులు ఆగవు చూడకపోతే… ఊసులు సాగవు చెప్పకపోతే
రెక్కలు లేని విహంగమల్లే ఉంటా
ఆశలు తుంచకె మాటలు ఆపి… అలజడి పెంచకె గుండెను మీటి
అందని తారాగ దూరం అయిపోతావా
ఏమైందో నీకీవేళ… ఏ మైకం కమ్మిందంతలా
నా వెంట పడుతూ విసిగించక పోరా
ఓ మైన వినవే… హామీనే ఇస్తున్నానే
కడవరకు నీతో నీవాన్నై ఉంటాను
పో పొమ్మని బ్రతిమాలడం… మగవారి చిరునామా
పొరపాటులే తెలిసే క్షణం బదులివ్వలేవా
ఈ అందాలన్నీ కలలై… చేజారిపోతే గుబులే
నువ్వు రాయని కధవలె… మిగిలానిలా ప్రియా
నీ వేశాలేంటో తెలుసులే… నీ మాటే నేను మరువనే
నే మారిపోయానపుడే శిలలాగా సఖా
కనుబొమ్మలా కలిసాం కదా కలిసుండలేమా
కనుకే ఇలా మిగిలాం కదా గుర్తించని పసితనమా
తానే నేనా, నేనే తానయ్యానా… అలా ఎలా ఉన్నా
ఎలా మరి..! నీ మాయే నన్నే మార్చి అల్లేసిందే ప్రేమా
ఎద చాటునున్న అలజడి నీవై ఉండిపోయే సదా
మది తాకుతున్న అలలాగ వచ్చిపోతే ఎలా

Comments