Epudu Neku Female Version Song Lyrics from sontham Movie in Telugu
గాయకులు : సుమంగళి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినిమా : సొంతం
నటీనటులు : ఆర్యన్ రాజేష్, నమిత
ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది
ఓ ఓ ఓ ..
ఎపుడు నీకునే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
గుండెలో ఆశనే తెలుపనేలేదు నా మౌనం
చూపులో భాషనే చదువనేలేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదురున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్కసారైనా
నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నీటి వానే కాదా

Comments