Gaganamu Daati Song Lyrics from Miles Of Love Movie In Telugu


సినిమా : మైల్స్ ఆఫ్ లవ్                                                                    గాయకులూ : యశస్వి కొండెపూడి, అదితి భావరాజు 

సాహిత్యం : ఆలరాజు                                                           సంగీతం : ఆర్ ఆర్ ధృవన్    

నటీ నటులు : అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి 



 గగనము దాటి ఎగరాలి చూడు… వయసుందోయ్ నేడు

దొరకనిదంటూ లేదంటా ఇపుడూ…
కనులను తెరిచి అందాలను చూడు… కలలేనా ఎపుడూ
జిందగి ఒకటే… లేవంటా రెండూ
నిలబడి చూస్తూనే ఉంటే… నిలవదు కద ఈ సమయం
చిలిపిగ గడిపెయ్యాలంటా జీవితం… ఓఓ ఓ
మనసుతో అడుగెయ్యకపోతే… దొరకదుగా సంతోషం

ప్రతి ఒక నిమిషం వరమనుకో… నీతో రాదా లోకం
ఏదో ఏదో ఉందో లేదో… రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే… ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని… అంతులేని ఆశలంటా
యుద్ధం చేస్తూ పోతే… జీవితమంతా వ్యర్ధమే

మనసే వెతికే పయనాలే… మొదలాయే
కనుకే కనులే మెరిసాయే.. ఏఏ
మదిలో ఎన్నో భావాలే… కదిలాయే
నడిపే జతనే పిలిచాయే…
బ్రతుకంటే ఊహకందని చిత్రాలే…
అనుకుంటూ సాగితేనే ఆనందాలే… ఏఏ ఏ

ఏదో ఏదో ఉందో లేదో… రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే… ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని… అంతులేని ఆశలంటా
యుద్ధం చేస్తూ పోతే… జీవితమంతా వ్యర్ధమే

ఎపుడూ నీతో ఉంటుందా… ఈ ప్రాయం
కనుకే బ్రతికెయ్ ప్రతి నిమిషం… ఆ ఆఆ
ఏదో ఒకటి అంటుందోయ్… ఈ లోకం
అన్ని వినకోయ్… నువు కొంచెం
మధురంగా ఉండనీ మరి.. నీ గమనం
సరదాగా చేరుకోవాలి… నీ గమ్యం

ఏదో ఏదో ఉందో లేదో… రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే… ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని… అంతులేని ఆశలంటా
యుద్ధం చేస్తూ పోతే… జీవితమంతా వ్యర్ధమే

Comments